World Environment Day/ప్రపంచ పర్యావరణ దినోత్సవం

World Environment Day/ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి NSS UNIT తరఫున అధ్యాపకులు మరియు విద్యార్థులు కలసి జిల్లెళ్ళమూడి గ్రామపరిసర ప్రాంతాలైన జమ్ములపాలెం, రేటూరు, కాకుమాను, అప్పాపురం, కర్లపాలెం,యాజలి గ్రామాలలోని అంగన్‌వాడి కేంద్రాలు, హైస్కూల్స్, పశువైద్యశాలల వద్ద పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నివారించి, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జ్యూట్ బ్యాగులు వాడుకోవాలని ప్రజలకు సూచించారు. పర్యావరణాన్ని సంరక్షించడం మన అందరి బాధ్యత అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు.
అదేవిధంగా కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో Principal డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు, SVJP TRUST MANAGING TRUSTEE శ్రీ వల్లూరి ప్రేమ్ రాజ్ గారు, జిల్లెళ్ళమూడి గ్రామసర్పంచ్, అధ్యాపకులు, విద్యార్థులు పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషించారు.
కళాశాల క్యాంపస్ లో వివిధ రకాల మొక్కలను నాటడం ద్వారా హరిత శోభను పెంచారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కలిగించి, సమాజానికి మంచి సందేశాన్ని అందించింది.

 

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర

“స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి వారిచే 2025 మే 17న మధ్యాహ్నం 3 గంటలకు గూగుల్ మీట్ ద్వారా Beat the Heat పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ హనుమత్ప్రసాద్ గారు ప్రారంభించి, కార్యక్రమం ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, వేసవిలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ యల్. మృదుల గారు “Beat the Heat” అంటూ విద్యార్థులు  వేసవిలో  తీసుకోవలసిన జాగ్రత్తల గురించి స్పష్టంగా వివరించారు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు తోటివారికి సహాయపడవలసిందిగా సూచించారు.

NSS కోఆర్డినేటర్ శ్రీ టి. జయకృష్ణ గారు PowerPoint ప్రజెంటేషన్ ద్వారా వేడి సంబంధిత ఆరోగ్య సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలో విద్యార్థులకు స్పష్టమైన సందేశాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 10 మంది అధ్యాపకులు, 63 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో విద్యార్ధులకు అన్ని విషయాలు అవగాహన కల్పించేందుకు Quiz నిర్వహించి e-Certificates అందించారు.

 

మాతృశ్రీ ఓరియంటల్  కళాశాల – పూర్వ విద్యార్థుల సమావేశం

మాతృశ్రీ ఓరియంటల్  కళాశాల – పూర్వ విద్యార్థుల సమావేశం

మాతృశ్రీ ఓరియంటల్  కళాశాల – పూర్వ విద్యార్థుల సమావేశం

 మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం 2025 మే 5న కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆన్నదానం హనుమత్ ప్రసాద్, అధ్యాపకులు మరియు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. గౌరవనీయులు శ్రీ దినకర్ అన్నయ్యగారు పాల్గొన్నారు. సమావేశంలో పూర్వ విద్యార్థుల తమ అనుభవాలను పంచుకున్నారు. వారు సమాజంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. ముఖ్యంగా పార్వతీపురం, పాలకొండ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని వివరించారు.

  1. పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించే అంశంపై చర్చ జరిగింది.
  2. ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులకు ఉచిత విద్య అందించాలన్న అంశాన్ని పరిశీలించారు.
  3. విద్యార్థులను ఉత్తమంగా ప్రోత్సహించడానికి గోల్డ్ మెడల్స్ కొనసాగించాలంటూ పూర్వ విద్యార్థులు సూచించారు.
  4. కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచే విధానాలను చర్చించారు.
  5. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం కోసం, మేనేజ్మెంట్ బ్రోచర్లు మరియు ఇతర ప్రచార సామాగ్రిని పంచింది.
  6. కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి. రాఘవేంద్రరావు గారు అనారోగ్య కారణంగా జరిగిన ఆకస్మిక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేయబడింది.
  7. శ్రీమాన్ ఎస్. వి. రామకృష్ణమాచార్యులు గారికి (మాతృశ్రీ పాఠశాల రిటైర్డ్ హెడ్మాష్టర్) సంతాపం తెలిపారు.
  8. ప్రస్తుత విద్యార్థులకు ఇచ్చే భోజన నాణ్యతపై పూర్వ విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.
  9. కళాశాల ప్రస్తుత విద్యార్థుల సంఖ్యపై చర్చించి, అభివృద్ధికి అనేక సూచనలు చేశారు.

పూర్వ విద్యార్థుల విరాళాలు:

 శ్రీ సూర్యరావు గారు (1986–1991 బ్యాచ్):  శ్రీ విశ్వజనని ట్రస్ట్, జిల్లెళ్ళమూడికి రూ. 1 లక్ష విరాళంగా అందించారు, ఇది ప్రస్తుత విద్యార్థుల అన్నదాన కార్యక్రమానికి ఉపయోగపడుతుంది.

  1. డా. ఎం. రామకృష్ణాంజనేయులు గారు (1985–1992 బ్యాచ్): కళాశాలకు రూ. 10,000 (పది వేల రూపాయలు) విరాళంగా అందించారు.
  2. ఈ సమావేశం పూర్వ విద్యార్థుల కళాశాల పట్ల ఉన్న బంధాన్ని, వారి సేవా దృక్పథాన్ని ప్రతిబింబించింది. కళాశాల అభివృద్ధి కోసం అందరూ కట్టుబడి ఉన్నారు.
Swachh Andhra Swarna Andhra

Swachh Andhra Swarna Andhra

Swachh Andhra Swarna Andhra

        ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు Commissioner of Collegiate Education (CCE) వారి సూచనల మేరకు ప్రతి నెల మూడవ శనివారం “స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర” కార్యక్రమంగా జరుపుకుంటున్నాం. ఏప్రిల్ 2025 నెలకు సంబంధించిన థీమ్ ఈ-వేస్ట్ నిర్వహణ (E-Waste Management)గా నిర్ణయించబడింది.

                ఈ సందర్భంగా 19-04-2025 శనివారం రోజున మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఈ-వేస్ట్ నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ముందుగా NSS కోఆర్డినేటర్ శ్రీ టి. జయకృష్ణ గారి ఆధ్వర్యంలో E-Waste నిర్వహణపై సెమినార్ నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. హనుమత్ప్రసాద్ విద్యార్థులకు E-Waste అనేది ఏమిటి, దాని వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావాలు మరియు E-Waste సరైన నిర్వహణ యొక్క ఆవశ్యకతను గురించి వివరంగా తెలియజేశారు. కళాశాలలోని E-Waste ను సేకరించి   E- Wasted వస్తువుల రకాలు, వాటి ద్వారా కలిగే ప్రమాదాలు మరియు సరైన రీతిలో నిర్వహించు పద్ధతుల గురించి వివరించారు. ఇందులో విద్యార్థులు, అధ్యాపకులు చురుకుగా పాల్గొని తమ వద్ద ఉన్న పాడైన లేదా ఉపయోగం లేని ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువచ్చి అందజేశారు. 12 మంది అధ్యాపకులు 40 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం  విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యతకు సంబంధించి చైతన్యం కలిగించింది.

 

అంబేద్కర్ జయంతి వారోత్సవాలు

అంబేద్కర్ జయంతి వారోత్సవాలు

అంబేద్కర్ జయంతి వారోత్సవాలు

అంబేద్కర్ 134వ జయంతి వారోత్సవాలు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ‘రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర’ అనే అంశంపై వక్తృత్వం, వ్యాసరచన పోటీలు జరిగాయి. అనంతరం జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎ. హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే అందరూ ఐకమత్యంతో ఉండాలని,  కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో జాతి సమైక్యతకు పాటుపడాలని వివరించారు.  ఇదే సభలో సంస్కృత శాఖాధ్యాక్షలు డాక్టర్.ఆర్.వరప్రసాద్ విద్య అనేది ఒక శక్తి అనీ, దానిని అంబేద్కర్ ఒక ఆయుధంగా మార్చుకొని  అణగారిన వర్గాల కోసం క్రొత్తదారులను ఎలా సృష్టించారో తెలియజేశారు. ఈ సమావేశంలో కళాశాల చరిత్ర ఉపన్యాసకులు శ్రీ పి.సుందరరావు గారు అంబేద్కర్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని, విద్యాశక్తితో తన జీవితం మార్చుకొని కోట్లాది మందికి ఎలా ఆదర్శంగా నిలిచారో వివరించి, రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ యొక్క ముఖ్యమైన పాత్రను విద్యార్థులందరికీ తెలియజేశారు. అనంతరం శాంతి మంత్రంతో  ఈ సమావేశం ముగిసింది.`