by MOC IQAC | Feb 21, 2025 | International Commemorative Days
అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల మరియు సమైక్య భారతి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21, శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ సభాకార్యక్రమం జరిగింది. కళాశాల కరస్పాండెంట్ శ్రీ గోగినేని రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో అయినాల మల్లేశ్వరరావు గారు గౌరవ అతిథి గా విచ్చేశారు. మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆంగ్లభాష ఉదరభాష మాతృభాష హృదయభాష అనీ, తల్లి ఒడిలో ఓనమాలు దిద్దిన వారు మాతృభాషను మరువరాదనీ అన్నారు. ఒక వ్యక్తి సంఘటిత శక్తి గా మారితే మాతృభాష పరిరక్షణ సుసాధ్యమని పలికారు. సహజకవి కావడంతో తమదైన శైలిలో సీస పద్యాలను ఆలపించి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతరం శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రష్ట్ సభ్యులు శ్రీ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ భాషలకు సంబంధించిన ఉద్యమాలు గానీ భాషాబోధనలు కానీ టెక్నాలజీ తో కలిపి ముందుకు తీసుకువెళ్ళాలని అప్పుడే భాష గొప్పతనం అందరికీ చేరుతుందనీ సూచించారు.
సమైక్యభారతి జాతీయ సమన్వయకర్త శ్రీ పి. కన్నయ్య గారు మాట్లాడుతూ తెలుగువాడి ఉనికి యావద్భారతదేశం లోనూ కనిపిస్తుంది కానీ తెలుగువాడి శక్తి సత్తా మరింత చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నదనీ తెలిపారు. 2000 సం లో తీసుకున్న నిర్ణయం తో సమైక్యభారతి ని ఏర్పాటు చేసి మాతృభాష పునరుద్ధరణ, కుటుంబవ్యవస్థ పరిరక్షణ లక్ష్యంగా నిర్విరామమైన కృషి చేస్తున్నామని వివరించారు. అంతేకాక మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల మరియు సమైక్య భారతి సంయుక్తంగా మాతృభాష ను పరిరక్షించడం లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల తెలుగు విభాగాధిపతి డా. యల్. మృదుల మరియు సంస్కృత శాఖాధిపతి డా. ఆర్. వరప్రసాద్ గారు మాతృభాష గొప్పదనాన్ని తెలిపారు. విద్యార్థులు పద్యాల అంత్యాక్షరి తో నృత్యప్రదర్శనలతో మాతృభాష గొప్పదనాన్ని తెలిపారు.
ఇదే వేదికపై నాన్నగారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని కళాశాలలోని విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల ఆటలపోటీలలో విజేతలకు అమ్మ తనయులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు ట్రోఫీలను, పతకాలను మరియు ధృవపత్రాలను అందించారు. తెలుగు ఉపన్యాసకులు జి. వీరాంజనేయులు గారు సభానిర్వహణ చేయగా జె. జయకృష్ణ గారు వందన సమర్పణ చేశారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.
by MOC IQAC | Feb 21, 2025 | Local Functions
బాలికల మరియు బాలుర వసతి గృహములలో అమ్మ ఆగమనోత్సవం
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతి గృహంలో ఫిబ్రవరి 20, 2025 బుధవారం అమ్మ ఆగమన ఉత్సవం జరిగింది. విద్యార్థినులు పచ్చని తోరణాలతో రంగవల్లులతో పుష్పాలతో అలంకరణలు చేసి అమ్మను భక్తిశ్రద్ధలతో అర్చించారు. కార్యక్రమంలో అమ్మ తనయులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, శ్రీ కామరాజు గారు మరియు పలువురు సంస్థ పెద్దలు, కళాశాల అధ్యాపకులు బృందం పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు.
ఫిబ్రవరి 21వ తేదీ గురువారం రోజున విద్యార్థుల వసతిగృహంలో అమ్మ ఆగమన ఉత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి అమ్మ తనయులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు మరియు సంస్థపెద్దలు విచ్చేశారు. విద్యార్థులు అందరూ ముక్తకంఠంతో లలితా సహస్రనామ పారాయణ చేశారు. విద్యార్థులలో ఆధ్యాత్మిక మానసిక చైతన్యాన్ని కలిగించే ఈ కార్యక్రమాలు అందరినీ ఐకమత్యంతో ఉంచేందుకు సహకరిస్తాయని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. యల్. మృదుల అన్నారు. పూజానంతరం తీర్థప్రసాదాలు స్వీకరించగా శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.
by MOC IQAC | Feb 15, 2025 | Special Days
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు commissioner of Collegiate Education మంగళగిరి వారు స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా పరిశుభ్రత, పారిశుద్ధ్యం మరియు వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించేలా ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 15.02.2025, శనివారం కళాశాల క్రీడాప్రాంగణంలో విద్యార్థులు అధ్యాపకులందరూ కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను చేశారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. A.హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ వేరు వేరు డబ్బాలలో ఈ చెత్తను ఉంచడం చాలా అవసరమనీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్వచ్ఛాంద్రను నిర్మించుకోవాలని తెలిపారు. సంస్కృత అధ్యాపకులు డా.వరప్రసాద్ గారు నెలల వారీగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలపై అధ్యాపకులకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యర్థపదార్థాలను ఉపయోగించే విధానాన్ని జిల్లెళ్ళమూడి గ్రామప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. 70 మంది విద్యార్ధినులు 20 మంది విద్యార్ధులు 10 మంది ఆద్యాపకులు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. తడిచెత్త, పొడిచెత్త, అపాయకరమైన వ్యర్థాలను వేరుచేసి De-Compose చేసి ఎరువులుగా తయారు చేసుకోవచ్చునని తద్వారా ప్రకృతిని కొంతైనా పరిరక్షించుకోగలమని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. దీనిని పురస్కరించుకొని కళాశాలలో పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత – ప్రాధాన్యత అనే అంశాలపై వక్తృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించబడ్డాయి.
by MOC IQAC | Feb 10, 2025 | National Commemorative Days
10.02.2025 సోమవారం National Deworming Day సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో WOMEN EMPOWERMENT CELL తరపున Health Care Program జరిగింది. జిల్లెళ్ళమూడి గ్రామ ఆశావర్కర్ శ్రీలక్ష్మి మరియు నర్స్ మానసలు విద్యార్థులకు నులిపురుగు మందు పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పోషకాహారాన్ని తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని, శారీరక మానసిక బలం చేకూరినప్పుడే విద్యలో గాని జీవితం లో గాని నాణ్యతను పెంపొందించుకోగలమని వివరించారు. డా. యల్. మృదుల మరియు అధ్యాపక బృందం విద్యార్థులను నులిపురుగు మందు పంపిణీ చేయడంలో సహకరించారు.
by MOC IQAC | Feb 1, 2025 | Sports
క్రీడోత్సవాలు
ఫిబ్రవరి 17, నాన్నగారి ఆరాధనోత్సవాల సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు నాన్నగారికి ఎంతో ఇష్టమైన క్రీడలలో జనవరి 30,31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో వివిధరకాల ఆటలపోటీలను నిర్వహించారు. జనవరి 30 వ తేదీ గురువారం SVJP TRUST సభ్యులు శ్రీ లక్కరాజు సత్యనారాయణ గారు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, మచిలీపట్నం ఆటల పోటీలను ఆరంభించి అందరికీ పోటీల విధివిధానాలను తెలియజెప్పారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ మరియు సత్యనారాయణ గారు విద్యార్థులకు Sports Kit ను అందజేశారు. మూడురోజుల పాటు జరిగిన పోటీల వివరాలు –
Track and field events (100m, 200m, Shot put, Javelin throw)
Team sports (Cricket, Kho-Kho, Kabaddi, Volleyball, Throw ball)
Games (Chess, Carrom, Tennikoit, Shuttle, Skipping, Musical Chairs)
ఈ యేడాది విద్యార్థులలో క్రీడాస్పూర్తి ని పెంచుతూ మన కళాశాల అంతర్గతపోటీలను నిర్వహించడమే కాక యూనివర్సిటీ స్థాయి పోటీలలో కూడా పాల్గొనేలా ప్రోత్సహించింది. South zone స్థాయిలో తిరుపతి National Sanskrit University లో సంస్కృత కళాశాల విద్యార్థులకు జరిగిన పోటీలలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు G. గణేష్ , S. హేమంత్ లు Badmintonలో రజతపతకం సాధించారు